XXXX About me XX News&Press XX Gallery XX Reviews XX Facebook XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX నేను నా సినిమాలు XXXX

Sunday, 30 March 2014


    స్పెషల్ జ్యూరి నంది అవార్డ్ గేలుచుకున్న 'బంద్'  టెలిఫిలిం,

 ప్రజా సంఘటితత్వానికీ, సంఘీభావానికీ, ఐక్యతకూ,నిరసన ప్రకటనకు, ఆగ్రహ వ్యక్తీకరణకూ, ఆకాంక్షకు బంద్ ప్రతీక.కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటి? అన్న ఆలోచనలోంచి పుట్టినదే బంద్ టెలిఫిలిం.నగరానికి వలసవచ్చినవారి జీవితాలు,రోజువారీ శ్రామికుల జీవనవిధానాన్ని,వారి కష్టాలను కన్నీళ్లను ప్రతిబింబించేలా వాస్తవానికి దగ్గరగా సన్నివేశాలను మలచి మాటలు రాయడం జరిగింది.
 కర్రి బాలాజీ దర్సకత్వంలో ప్రణతి క్రియేషన్స్ బేనర్ పై నిర్మాత కునిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు.
 బంద్ టెలిఫిలింకు 2011-2012 సంవత్సరానికిగాను స్పెషల్ జ్యూరి నంది అవార్డ్ దక్కించుకుంది. 
రాష్ట్ర టీవీ నంది అవార్డుల ప్రదానోత్సవం మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ తేరు మైదానంలో జరిగిన సభలో 
నంది అవార్డు అందుకున్న దర్శకుడు కర్రి బాలాజీ , నిర్మాత కునిరెడ్డి శ్రీనివాస్ గారితో నేను.