వెన్నెల - Andhra Bhoomi
27/02/2015- వి
తారాగణం: రంజిత్ సోమి, సన ఫాతిమా, అలీ, జయప్రకాశ్‌రెడ్డి, బెనర్జీ, తా.రమేష్ తదితరులు
సంగీతం: రామనారాయణ
నిర్మాత:గుర్రాల కృష్ణారెడ్డి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పి నరసింహారెడ్డి
ఇల్లలికితే -పండగ. టైటిల్ దొరికితే -సినిమా. ఇటీవల వస్తున్న కొన్ని సినిమాలు చూస్తుంటే టాలీవుడ్లో ఈ ధోరణి బలపడుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయ. పల్లవిలోని ప్రథమ పంక్తినో, చరణంలోని చివరి లైనునో టైటిల్ చేసుకుని -కథను వండుకుంటున్న సినిమాలు కోకొల్లలు. నిజానికి ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే -గట్స్ ఉండాలి. కొత్తగా వస్తున్న దర్శకుల్లో అది కాస్త ఎక్కువేననిపిస్తోంది. అందుకే -పల్లవీ చరణాల్లోని ఇంపైన పదాలు ఏరుకుని టైటిల్ తయారు చేసుకుని, టైటిలానుగుణంగా కథను వండేసుకుంటున్నారు. సినిమాలో అంత డెప్త్ ఉంటుందా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం....‘?’!
కొత్తగా వస్తున్న కొన్ని తెలుగు సినిమాల స్టయిలే వేరు. -సినిమా చూపించడానికి సింగిల్ పాయింట్ చాలన్నదే ఆ స్టయిల్. కాకపోతే -ఆ సింగిల్ పాయింట్లో సినిమాను నడిపించేంత సరుకుందా? లేదా? అన్నది డైరెక్టర్ పాయింట్ వ్యూలో మరో కీలకమైన పాయింట్. ఏక పంక్తి కథను ఏకబిగిన రెండు గంటల సినిమాగా చూపించాలంటే -ఎలాంటి సన్నివేశాలు వండుకోవాలి, ఎక్కడెక్కడ నట్లు బిగించాలి.. ప్రేక్షకుడు కోరుకునే ఎంటర్టైన్మెంట్ను ఎంత మోతాదులో అందించాలన్న అంశంపై దర్శకుడికి సరైన అవగాహన ఉంటే.. డైరెక్టర్ ఆలోచనలకు మిగతా క్రూ మొత్తం సరైన స్క్రూలు బిగిస్తే.. సినిమా నల్లేరుమీద బండి నడకలా సాగుతుంది. లేదంటే -పల్లేరు మీద చెప్పుల్లేని పరుగే అవుతుంది. ‘నువ్వు నేను ఒకటవుదాం’ అంటూ వచ్చిన సినిమాది -పల్లేరుమీద పరుగే.
కథేంటంటే..
ముందు అనుకున్నట్టు.. కంటికి కనపించనంత బుల్లి ట్విస్ట్ చుట్టూ అల్లుకున్న చిన్ని కథ కనుక చెప్పడానికి ఎక్కువ ప్రయాస పడాల్సిన పనిలేదు. అదేంటంటే.. -హీరో అభి (రంజిత్ సోమి) రిచ్‌గా కనిపించే ఊర మాసు. జీవితంలో లక్ష్యం లేకుండా తిరిగే కామెడీ ఆవారాగాళ్ల విద్యార్థి బృందానికి లీడర్ కూడా. ధనవంతుడైన బెనర్జీ కూతురు సనను చూసి లవ్‌లో పడతాడు. ఆమెవెంట పడతాడు. కాలేజ్ టూర్లో చిన్న ఇన్సిడెంట్‌తో ముగ్గులోకి దింపేస్తాడు. దీనికోసం వండుకున్న సన్నివేశాలే -్ఫస్ట్ఫా. అయితే తన కూతురినిచ్చి పెళ్లి చేయాలంటే -నవతరపు యువకులకు ప్రతినిధిలాంటి బుద్ధిమంతుడైన తన కొడుకును చెడగొట్టాలని హీరో అభికి చాలెంజ్ విసురుతాడు. ఆ చాలెంజ్‌లో అభి విన్నర్‌గా నిలిచాడా? సనను సొంతం చేసుకున్నాడా? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడన్నది మిగతా సినిమా కథ.
ఎవరెలా చేశారంటే..
యాక్షన్ మూవీస్‌కు పనికొచ్చే యాక్టివ్నెస్ ఉన్నా, ఎక్స్‌ప్రెషన్స్‌లో హీరో రంజిత్సోమి చాలా వర్కవుట్స్ చేయాల్సి ఉంది. వాళ్లవాళ్ల అనుభవంతో సినిమాకు ఒకింత ప్లస్కాగల అలీ, బెనర్జీ, జయప్రకాష్‌రెడ్డిలు ఉన్నా పాత్రల నిడివి పరిమితం కనుక చేయగలిగిందేమీ లేదు. అందంలోను, అభినయంలోనూ హీరోయిన్ సన ఫాతిమాది -పూర్ పర్ఫార్మెన్స్. జబర్దస్ గ్యాంగ్, తాగుబోతు రమేష్‌లకు ఆకట్టుకోగలిగే సన్నివేశాలే లేవు. సంగీతం, ఎడిటింగ్, ఫొటోగ్రఫీలాంటి సాంకేతిక విభాగాల్లోనూ చెప్పుకోదగ్గ మెరుపులు ఎక్కడా కనిపించవు.
విశ్లేషిస్తే ..
కథనం కరెక్ట్‌గా నడవాలంటే -కథలో కాన్ఫ్లిక్ట్ బలంగా ఉండాలి. కాన్ఫ్లిక్ట్ను పరిష్కరించాల్సిన హీరో అంతకంటే బలమైనవాడై ఉండాలి. సమస్య పరిష్కారానికి, ఛాలెంజ్ ఎదుర్కోడానికి -హీరో పడే స్ట్రగుల్ ప్రేక్షకుడూ అనుభవించినపుడే ఆ క్యారెక్టర్లో లీనమవుతాడు. సమస్యను చాకచక్యంగా పరిష్కరించి సక్సెస్ సాధించినపుడే -కథలోని హీరో, స్క్రీన్ముందున్న ప్రేక్షకుడు రిలీప్ పొందుతాడు. ఈ ఫక్తు ఫార్ములా ‘ను.నే.ఒ’లో ఎక్కడా కనిపించదు. ప్రేమను బతికించడానికి, ప్రేమికురాలిని సొంతం చేసుకోడానికి -హీరో పాత్ర చిల్లర స్నేహితులమీద ఆధారపడిన సన్నివేశాలన్నీ వెగటు పుట్టిస్తాయి. సిగరెట్, ఆల్కాహాల్, జూదం, అమ్మాయిలతో ఫ్రెండ్షిప్లాంటి చిల్లర వ్యవహరాలు ఫన్నీయేతప్ప వ్యసనాలు కాదని చెప్పుకున్న హీరో -చివరకు తన ప్రేమికురాలి తమ్ముడిని చెడగొట్టడానికి వాటినే ప్రయోగించడం.. ఆ పాత్ర ఉదాత్తతను పూర్తిగా దెబ్బతీసింది. ‘నువ్వు నేను ఒకటవుదాం’ అన్న టైటిల్లోని గాఢత తప్ప సినిమా, దానికోసం ఎంచుకున్న కథలో అలాంటి గాఢత ఛాయలు కనిపించవు. అదే అతిపెద్ద మైనస్.
కంచికి చేరాలంటే ఎన్నో మార్గాలు. కంచికి చేరాల్సిన కథకు -వాటిలో ఏదోక దారి తెలిసుండాలి. జర్నీ మొదలయ్యే వరకూ ఏదారీ తెలుసుకోకపోతే -గుడ్డిగా వెళ్లేది గోదారే కావొచ్చు. ‘ను.నే.ఒ’లో ఆసాంతం అదే కనిపిస్తుంది. గోదావరిలో పడిన హీరోయిన్ను హీరో రక్షించగలిగాడు -సినిమాలో. కానీ, గోదాట్లో పడిన సినిమాను హీరో, దర్శకుడు, సాంకేతిక విభాగం ఎవ్వరూ రక్షించలేకపోయారు.
ఒక్కముక్కలో చెప్పాలంటే -సమష్టి ప్రయత్నం ఒక్కటిగా వృధా అయ్యింది
సమీక్ష : టాప్ ర్యాయంకర్స్ .
వెన్నెల - Andhra Bhoomi
06/02/2015
-సంకల్ప
తారాగణం:సంగీతం: జయసూర్య
నిర్మాతల:పసుపులేటి బ్రహ్మం ,విశ్వవిజన్ ఫిలిమ్స్
దర్శకత్వం: గోళ్లపాటి నాగేశ్వరరావుకథ:
చదువుకొనే రోజులుపోయి చదువు‘కొనే’ రోజులొచ్చాయని అందరూ అనుకునేవారే తప్ప, దాన్ని మారుద్దామని తలపోసిన వారు తక్కువ. అలా చేస్తే రేసులో ‘తక్కువై’పోతామోనన్న భయం కూడా అడుగేయక పోవడానికి కారణం కావొచ్చు. ఇక సృజనాత్మక రంగంలో ఆ తరహా కృషి మరీ తక్కువ. అడపాదడపా ఒకటో అరో సన్నివేశాల్లో అలాంటివి స్పృశించినా అదే పాయింట్ ప్రధానంగా అల్లుకుని దానికి అనుబంధంగా ‘ర్యాంకర్స్’ను కొనేసే విధానాన్ని కూడా పూర్తిస్థాయిలో చూపడానికి ‘ప్రయత్నం’ చేసిన ప్రథమ చిత్రం ‘టాప్ ర్యాంకర్స్’ కావొచ్చు. ‘ప్రయత్నం’ అనే ఎందుకు పేర్కోవాల్సి వచ్చిందంటే అలా చేసే ‘ప్రయత్నం’ సంపూర్ణం కాకుండా మధ్యమధ్యలో అనేక అనవసర అంశాలు కల్పించడంవల్ల! అందువల్లే ‘టాప్ ర్యాంకర్స్’ ఆచరణలో ‘లాస్ట్’ర్యాంకర్స్‌గా మిగిలిపోయారు. అదేమిటో చూద్దాం.
‘విద్యార్థులు తమ కాలాన్నంతా చదువుకు తప్ప మరేదానికీ వినియోగించకూడదు’ అన్న అంధ నమ్మకంతో ఉన్న విద్యా సంస్థ ప్రిన్సిపాల్ డా విశ్వనాథ్ (రాజేంద్రప్రసాద్). కానీ, జీవితంలో ఎదురైన ఓ విషాద అనుభవంతో మారతాడు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదివితేనే ప్రయోజకత్వం సాధిస్తారన్న దిశగా అడుగేలేస్తాడు. అలా వెళ్లడం వల్ల అతను ఎదుర్కొన్న అనుభవాలూ, అనంతర పరిణామాలు మిగతా కథ. ‘పాయింట్’ వైవిధ్యమైనదే! కానీ తెరపై ప్రొజెక్ట్ చేయడంలో దర్శకుడు అవలంభించిన అనాశక్తి విధానం -ఆడియన్స్ సహనాన్ని రెండుగంటలు విశేషంగా పరీక్షిస్తుంది. దానికితోడు చూపిన సన్నివేశాల్లోనూ అతిశయోక్తిపాళ్లూ ఎక్కువే అనిపించాయి. ఉదాహరణకు కాలేజీలో చదివి టాప్‌ర్యాంక్ పొందిన వారిని ఇంకో కళాశాలవారు లోబర్చుకుని, వాళ్లచేత వారు తమ కాలేజీకి చెందిన విద్యార్థులుగా ప్రకటించడం అక్కడక్కడ వాస్తవ జగతిలో జరుగుతుండొచ్చు. కానీ ఈ చిత్రంలో మాదిరిగా ‘మాస్ బయ్యింగ్’ ఎక్కడా జరిగి ఉండదు. ఇక కాలేజీలో చదువుతున్న పిల్లల్ని కలుసుకోడానికి వచ్చిన తల్లిదండ్రుల్ని ఈ చిత్రంలోలా ఏదో జంతువుల్ని బోనుల్లో ఉంచి చూపడం అనేదీ దాదాపుగా అస్సలుండదు. ఆత్మీయులు చనిపోయినా సంబంధిత పిల్లల్ని పంపననే స్థాయి విద్యాసంస్థలూ ఉండవు. ప్రథమభాగంలో తండ్రి పెడుతున్న విద్యా టార్చర్‌కి విసిగిపోయి కూతురే నిద్రమాత్రల్ని మింగి తనువు చాలించడం వంటివి కంట తడిపెట్టించినా, ద్వితీయార్థంలో విద్యార్థిని వెంటపడే దుండగుడు, స్టంట్స్ తదితరాలు వెగటు పుట్టించాయి. ఇంకా మ్యూజిక్ టీచర్ పాత్రధారిణితో చేయించిన నృత్యం వగైరాలు ‘అయిటెమ్ సాంగ్’ని తలపించాయి. సందేశపరంగా సినిమాను రూపొందించే ప్రయత్నంలో వికారాలకు లోనై సినిమాను నడపడం విడ్డూరమనిపించింది. నటీనటుల పాత్ర పోషణ తదితరాలు చెప్పుకొనే ముందు ఇక్కడో చిన్నమాట చెప్పుకోవాలి. ఏ నటుడు, నటి రాణించాలన్నా వారితోపాటు సహకళాకారుల నటనా అదేస్థాయిలో కాకపోయినా కనీస స్థాయిలోనైనా ఉండాలి. అలాంటి సహకారం చిత్రంలో ఎక్కడా కనిపించదు. దాంతో అనుభవజ్ఞుడైన రాజేంద్రప్రసాద్ (విశ్వనాథ పాత్రలో) నటనా రాణించలేదు. ఎందుకంటే ఆయన పక్కన నటించిన ఏ కళాకారుడూ సరైన అవగాహనతో చేయలేకపోయారు. పరిస్థితిని కనిపెట్టిన రాజేంద్రప్రసాదూ కొన్ని సన్నివేశాల్లో రిలాక్స్అయి నటించినట్టు కనపడింది. రాజేంద్రప్రసాద్‌కు ఇచ్చిన హిట్లర్ వీరప్పన్ గెటప్‌లు బావున్నాయి. రాజేంద్రప్రసాద్ తర్వాత ఓ మాదిరి ప్రశంసాపూర్వక నటనను కనపర్చింది కూతురు శ్రావణి పాత్ర పోషించిన నటి. పాటల్లో ఏ పాటా చెప్పుకోతగ్గదిగా లేదు. సాహిత్యపరంగా ‘ఇది ర్యాంకుల రణరంగం’... బావుంది. అలాగే ‘వీడు మామూలోడు కాదురా, ఒసామా బిన్ లాడెన్, సూటూబూటూ వేసొచ్చిన కిల్లర్ వీరప్పన్’ సరదాగా అనిపించింది. ‘సబ్జెక్టులన్నీ పక్కకుపెట్టి, అల్లరిచేద్దాం పద’ అన్న పాట చిత్రీకరణపరంగా సినిమా ప్రధాన భావాలకు విరుద్ధంగా ఉంది. ‘ఇలాచేస్తే ర్యాంకర్లు కాదు, రోబోలు తయారవుతారు. ‘ఎల్కేజీ సీటుకోసం కేజీ బంగారం అమ్మాల్సొస్తోంది’ వంటి సంభాషణలు బాగున్నాయి. ‘తీయగా పాడే కోకిలకేం ర్యాంకు’ అన్న పదాలు కాస్తంత ఆలోచింపచేశాయి. ‘యూరిన్- ఫారిన్’లాంటి పదాల్ని పరిహరించి ఉండాల్సింది. ‘టాప్ ర్యాంకర్స్’కి ఉపశీర్షికగా పెట్టిన నినాదం- ‘ఎ జర్నీ ఫ్రమ్ ఎల్కేజీ టు ఎమ్సెట్’కి కూడా సరైన జస్ట్ఫికేషన్ సినిమా చూపించలేకపోయింది. అయితే ఈ చిత్రంలో చెప్పిన ర్యాంకర్స్ పోటీ- తద్వారా అపసవ్య వ్యాపార పోకడలవల్ల పుట్టుకొచ్చిన ‘ర్యాంకర్స్ కొనుగోలు’ విధానాలకు మూలమైన అంశం- ‘వయసు- చదువుతున్న తరగతికి మించిన సిలబస్- జ్ఞాపకశక్తిని మాత్రమే పరీక్షిస్తున్న ప్రస్తుత పరీక్షా విధానం’ తదితరాల సంస్కరణలపై సినిమా ఫోకస్ చేసుంటే సమగ్రత వచ్చేది. ఏదేమైనా చిన్న చిత్రం అంటే ఏవో కొన్ని అల్లిబిల్లి ప్రేమ సన్నివేశాలు పోగుచేసి ప్రజలమీద వదిలేసే టైపులోకి వెళ్లకుండా కాస్తంత సీరియస్ అంశంపై దృష్టిపెట్టడం అభినందనీయం. కానీ దాన్ని చలనచిత్ర మాధ్యమానికి ముఖ్యంగా కావాల్సిన ‘ఆసక్తికర ఆవిష్కరణ’ అన్న విషయాన్ని విస్మరించడం వల్ల ‘టాప్ ర్యాంకర్స్’ పేరుకుతగ్గ ప్రతిఫలం పొందలేకపోయారు. మరి ఈ సినిమాలోనే రాజేంద్రప్రసాద్ పరంగా చెప్పించిన సంభాషణ ‘ఓడిన వాడికే గెలిచే అవకాశముంటుంది’- స్ఫూర్తితో చిత్రకర్తలు మలి ప్రయత్నాన్ని చేస్తారని ఆశిద్దాం.
సమీక్ష : ఈ వర్షం సాక్షిగా .
| Release date : Dec 13, 2014 | ||
| 123telugu.com Rating : 2.25/5 | ||
| Director : రమణ మొగిలి | ||
| Producer : బి ఓబుల్ సుబ్బారెడ్డి | ||
| Music Director : అనిల్ గోపి రెడ్డి | ||
| Starring : వరుణ్ సందేశ్, హరిప్రియ |
గత కొంత కాలంగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న యువ హీరో వరుణ్ సందేశ్. నేడు ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుణ్ సందేశ్ కు జోడిగా హరిప్రియ నటించిన ఈ సినిమాకు రమణ మొగిలి దర్శకత్వం వహించారు. బి ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మాత. మరి, వరుణ్ సందేశ్ కోరుకున్న విజయాన్ని ఈ సినిమా అందించిందా..? లేదా..? ఓ లుక్కేయండి.
కథ :
జై (వరుణ్ సందేశ్) ఎప్పుడూ అమ్మాయిల చేతిలో మోసపోయే ఓ అమాయకపు కుర్రాడు. ఒకరోజు రైలు ప్రయాణంలో మహాలక్షి (హరిప్రియ)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇంటికి చేరుకున్న తర్వాత మహాలక్ష్మికి తన మనసులో ప్రేమను వ్యక్తం చేయాలనే నిర్ణయం తీసుకుంటాడు. వెంటనే మహాలక్ష్మి సొంతూరికి ప్రయాణం అవుతాడు.
మహాలక్షి ఊరికి వెళ్ళిన తర్వాత జైకు ఓ చేదు నిజం తెలుస్తుంది. పెద్ద షాక్ తగులుతుంది. మరెవరో వక్తితో ఇల్లు వదలి వెళ్ళిపోయి తన కుటుంబ సభ్యులను మనోవేదనకు గురి చేస్తుంది. ఇప్పుడు జై ఎం చేశాడు..? మహాలక్షి ఎక్కడుందో తెలుసుకున్నాడా..? జై ప్రేమకథ ఏమైంది..? వంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు బేసిక్ ప్లస్ పాయింట్ వరుణ్ సందేశ్ మరియు అతని నటన. అమాయకపు యువకుడి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. తన శక్తి సామర్థ్యాలను మేరకు జై పాత్రలో అద్బుత నటన కనబరిచాడు.
సినిమాలో ఫస్ట్ హాఫ్ ఓకే, సరదా సరదా సన్నివేశాలతో ముందుకు వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో జబర్దస్త్ గ్యాంగ్ వేణు, ధనరాజ్ మరియు చంద్రలు తమ కామెడీతో పేక్షకులను కాసేపు నవ్వించారు. హీరోయిన్ హరిప్రియ ఆమె పాత్రలో ఒదిగిపోయింది. చాలా అందంగా కనిపించడంతో పాటు సినిమా ఆద్యంతం హీరో వరుణ్ సందేశ్ కు మంచి సపోర్ట్ ఇచ్చింది.
మైనస్ పాయింట్స్ :
పాపం.. వరుణ్ సందేశ్ కు ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాలో ఒక్క అంశం కూడా కలసి రాలేదు. నిరాశకు గురి చేసే కథ, కథనాలతో ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. అసలే కాలం చెల్లిన కథ అనుకుంటే, కథనం మరింత ఘోరంగా ఉంది. అనవసరమైన ట్విస్టులు & మలుపులతో సెకండ్ హాఫ్ నిదానంగా సాగుతుంది. సినిమాలో కామెడీ అంతా ఫస్ట్ హాఫ్ కు పరిమితం చేశారు. బోరింగ్ మరియు ఊహించదగిన సన్నివేశాలతో సెకండ్ హాఫ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
సెకండ్ హాఫ్ లో కూడా దర్శకుడు ప్రేక్షకులను నవ్వించడానికి ప్రయత్నించాడు. కాని, ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవ్వలేదు. కామెడీ బిట్స్ గా అయితే చూసి నవ్వుకోవడానికి పర్వాలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలలో ఎమోషన్ ను కామెడీ చెడగొట్టింది. రచయితలు కథను ఆసక్తికరంగా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు.
సినిమాలో ప్రతి ట్విస్ట్ ను ప్రేక్షకులు ముందే ఊహించగలరు. ఓ కామెడీ గ్యాంగ్ చుట్టూ కథను నడిపించి గట్టేక్కేద్దాం అని దర్శకనిర్మాతలు భావించారు. అది అసలుకే ఎసరు పెట్టింది. ఆ కామెడీ కాస్త కూడా నవ్వించలేకపోయింది. జీవా ట్రాక్ అయితే ఫూలిష్ గా ఉంది.
సాంకేతిక విభాగం :
మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. లిరిక్స్ కూడా బాగున్నాయి. స్క్రీన్ ప్లే అత్యంత నిరాశాజనకంగా మరియు చాలా ఊహాజనితంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. కాకపోతే క్లైమాక్స్ లో కొన్ని కామెడీ సన్నివేశాలను కత్తిరించి పారేయాల్సింది.
ఇక, దర్శకుడు రమణ మొగిలి తన భాద్యతను నిర్వర్తించడంలో విఫలమయ్యాడు. సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా.. ఇంటర్వెల్ తర్వాత దారి తప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. లాజిక్ లేని సన్నివేశాలు, అనవసర కామెడీ ట్రాక్స్ తో సెకండ్ హాఫ్ ను నింపేశారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.
తీర్పు :
విజయం కోసం వరుణ్ సందేశ్ మరింత కాలం వెయిట్ చేయక తప్పదు. ‘ఈ వర్షం సాక్షిగా’ లాంటి స్క్రిప్ట్ తో సక్సెస్ అందుకోవడం కష్టమే. వరుణ్ సందేశ్ పెర్ఫార్మన్స్, ఫస్ట్ హాఫ్ మాత్రమే సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. మిగతా సినిమా అంతా చాలా బోరింగ్ గా ఉంది. ఈ సినిమాను చూడాలో..? వద్దో..? మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం
123తెలుగు టీం
.jpg)