XXXX About me XX News&Press XX Gallery XX Reviews XX Facebook XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX నేను నా సినిమాలు XXXX

Wednesday, 31 December 2014

      

     100% in 2015 I will entertain...... U all....... Happy new year friends....          

Saturday, 20 December 2014

EE VARASHAM SAKSHIGA ....



వరుణ్ సందేశ్, హరిప్రియ జంటగా మొగిలిరమణ దర్శకత్వంలో బి.ఓబుల్ సుబ్బా రెడ్డి, శ్రీనివాస్ చవాకుల నిర్మించిన 'ఈ వర్షం సాక్షిగా' చిత్రం విడుదలై సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది. ..........
 సక్సెస్ మీట్ లో నిర్మాత బి.ఓబుల్సుబ్బారెడ్డి మాట్లాడుతూ - ''సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. 120 కిపైగాథియేటర్స్ లో విడుదల చేసాం. ఇన్ని థియేటర్స్ లో విడుదల చేయడానికి ముందు భయపడ్డాను. కానీ ఇప్పుడు ఇంకా థియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే బాగుండేదనిపిస్తోంది.  ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.  ప్రేమికులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలియజెప్పే చిత్రం ఇది.  ఈ సినిమాకి ప్రేక్షకాదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
డైరెక్టర్ మొగిలిరమణ మాట్లాడుతూ - ''సినిమా  హిట్ టాక్ తో ముందుకు దూసుకెళుతోంది. మంచి సినిమా చేసాం. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అని చెప్పారు.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ - ''సంధ్య థియేటర్ లో సినిమా చూసాము. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్. నా గత చిత్రాలకంటే, ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. జబర్ధస్త్ టీం చేసిన కామెడీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అని తెలిపారు. 
ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ హరిప్రియ, కాశీ విశ్వనాధ్ తదితరులు పాల్గొని సినిమా విజయం సాధించడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. 

Monday, 1 December 2014


                       నువ్వు నేను ఒకటవుదాం మూవీ ఆడియో...




     
  రంజిత్‌, సన జంటగా జి.కె.ఆర్‌.ప్రొడక్షన్స్‌ పతాకంపై జి.కృష్ణారెడ్డి నిర్మిస్తున్న సినిమా  నువ్వు నేను ఒకటవుదాం పి.నరసింహారెడ్డి దర్శకుడు.  రామ్‌ నారాయణ్‌ స్వరపరచిన ఈ సినిమాలోని పాటలను శుక్రవారం 28-11-14 హైదరాబాద్‌లో శ్రేయాస్ మ్యూజిక్ ద్వార విడుదల  చేశారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ కలిసి , ఆడియో సీడీలను, నాగశౌర్య థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ''రంజిత్‌ మా కుటుంబసభ్యుడు, ట్రైలర్‌, పాటలు చాలా బావున్నాయి, దర్శకనిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తెరకెక్కించారు అని బొత్స దంపతులు తెలిపారు.''  నిర్మాత మాట్లాడుతూ యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ఇది. అందరికీ బాగా కనెక్ట్‌ అవుతుంది, రామ్‌నారాయణ్‌ సంగీతం సినిమాకి ప్లస్‌ అవుతుంది. రంజిత్‌ బాగా నటించాడు. మంచి టీమ్‌ కుదిరింది అని అన్నారు.  దర్శకుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ కలర్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌, యూత్‌ మరియు ఫ్యామిలీ కలిసి చూసే సినిమా అని చెప్పారు.  కామెడీ విత్‌ లవ్‌స్టోరీ అని హిరో రంజిత్‌ హిరోయిన్ సన అన్నారు. మంచి పాటలు, మాటలు ,రి-రికార్డింగ్  కుదిరాయని  డి.ఓ.పి  సంతోష్ శాన్మోని చెప్పారు.  సినిమా పెద్ద హిట్‌ కావాలని నాగశౌర్య, బీవీయస్‌యన్‌ ప్రసాద్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్‌.రావు, రమేష్‌ పుప్పాల, సంజన, సాయిరాజేష్‌ ,సముద్ర,  జె .ప్రభాకర రెడ్డి  ఆకాంక్షించారు.